ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Amitabh Bachchan Health Rumours Dismissed

తనపై వస్తున్న రూమర్స్ కి బిగ్ బి చెక్


బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాని కోసం ఆయన ముంబై టు హైదరాబాద్ అంటూ తిరుగుతున్నారు. ఈ సమయంలో అమితాబ్ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చేరారు అనే వార్తలు సోషల్ మీడియాని కమ్మేశాయి.

గత శనివారం అమితాబ్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారంటూ వస్తున్న వార్తలపై అమితాబ్ సన్నిహత వర్గాలు స్పందించాయి. అమితాబ్ మే 16 శనివారం ఆసుపత్రికి వెళ్లిన మాట వాస్తవమే కానీ అది కేవలం రొటీన్ చెకప్ కోసమేనని సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి.

ఆసుపత్రిలో పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని తెలిపాయి. మరోపక్క అమితాబ్ కూడా తను ఆరోగ్యం అన్నట్లుగా.. మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. దానితో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Amitabh Bachchan Dismisses Hospitalisation RumoursAmitabh Bachchan Health Rumours Dismissed