ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR Dragon Glimpse Shows Brutal Assassin Look In Prashanth Neel World

డ్రాగన్ గా ఎన్టీఆర్ విశ్వరూపం


ఎప్పుడెప్పుడా #NTRNeel కాంబో గ్లింప్స్, ఎన్టీఆర్ బర్త్ డే కి సమయం ఎప్పుడవుతుందా అని ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ గొప్ప బహుమతిని అందించారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. ఎన్టీఆర్ ని విష్ చేస్తూ మేకర్స్ #NTRNeel కాంబో డ్రాగన్ గా టైటిల్ గ్లింప్స్ ని రివీల్ చేసారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేరెక్టర్ ని పరిచయం చేస్తూ డ్రాగన్ గ్లింప్స్ సాగింది. పవర్ ఫుల్ పాత్రలో డిఫ్రెంట్ గా ఇంటెన్స్ లుక్ లో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించడమే కాదు.. ఎన్టీఆర్ డ్రాగన్ గా చెప్పిన డైలాగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయమే, ఆ డైలాగ్ తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు అభిమానులు.

'నిదరపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ మొహాలు రావు, మిగిలున్న శత్రువుల మొహాలే కనబడతాయి. పొరబాటున కూడా నా కల్లోకి రావొద్దు' అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ గ్లింప్స్ అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేస్తున్నాయి. అభిమానుల ఆకలిని ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ తీర్చేసింది.

ఎన్టీఆర్ లుక్, రవి బాస్రూర్ బ్యాక్ రౌండ్ స్కోర్, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంత్ నీల్ డార్క్ మేకింగ్ అన్ని డ్రాగన్ గ్లింప్స్ కి హైలెట్స్ గా నిలిచాయి. 

NTR ,NTR Dragon Glimpse Shows Brutal Assassin Look In Prashanth Neel World