స్టార్ హీరో లోన్లీ పోస్ట్ కలకలం.. చివరికి క్లారిటీ

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక క్రైప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. తన ఫోటోని షేర్ చేసిన భాయ్.. ఒంటరిగా ఉండటంలో `అలోన్` (మన ఇష్టపూర్వకంగా ఒంటరిగా ఉండటం), `లోన్లీ` (ఎవరూ తోడు లేక ఒంటరితనాన్ని అనుభవించడం) అనే రెండు రకాలు ఉంటాయని, మీరేంటో మీరే తేల్చుకోండి! అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు. దాంతో 60 ఏళ్ల వయసున్న సల్మాన్ తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడి లేదా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడేమోనని అభిమానులు, నెటిజన్లు తెగ కంగారుపడిపోయారు. ఈ వార్త జోరుగా వైరల్ అయింది. చివరికి సల్మాన్ తల్లి సల్మా ఖాన్ సైతం ఆందోళనతో `ఏమైంది బేటా?` అని అడిగేంతవరకు వెళ్ళింది.
ఈ సోషల్ మీడియా హడావుడి చూసి వెంటనే స్పందించిన సల్మాన్ ఖాన్.. తాను ఒంటరిగా ఏమీ లేనని, అందరినీ కాస్త `చిల్` అవ్వమని కోరారు. ఇంత పెద్ద అద్భుతమైన కుటుంబం, స్నేహితులు , కోట్లాది మంది అభిమానుల దువాలు నా చుట్టూ ఉండగా నేను ఎలా ఒంటరిని అవుతాను? అని భాయ్ వివరణ ఇచ్చారు. ఒక్కోసారి నిరంతరం జనాలు, పబ్లిసిటీ మధ్య ఉండి విసుగొస్తుందని అందుకే కాస్త `మీ టైమ్` (సొంత సమయం) గడపాలని ఆ పోస్ట్ పెట్టానని.. దాన్ని కాస్తా బ్రేకింగ్ న్యూస్ చేసేశారని నవ్వేశారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మాతృభూమి` చిత్రంతో పాటు, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు-వంశీ పైడిపల్లి కాంబో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రంతోను బిజీగా గడుపుతున్నారు. ఈద్ కి సల్మాన్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నాడు.






































