సమాజంలో మార్పు కోసం గళమెత్తిన నటి!

బాలీవుడ్ లో విలక్షణ నటిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి కులకర్ణి. జీవితంలో ఎదు రైన ఒడిదొడుకులను అధిగమించి ఎందరికో? స్ఫూర్తిగానూ నిలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్యానికి సంబంధించిన కొన్ని చేదు జ్ఞాపకాలను పంచుకుంది. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కొన్ని అవమానాలు, వివక్షలు వ్యక్తిగా తనను ఎంతగానో కుంగదీశాయన్నారు. అయితే అవే అవమానాలు భవిష్యత్తులో సమాజంపై తిరగబడేలా తన గళాన్ని బలంగా వినిపించేలా మార్చాయని ఎమోషనల్ అయ్యారు.
తన జీవిత అనుభవాల నేపథ్యంలో సమాజంలో నలిగిపోతున్న సామాన్యులు, మహిళల హక్కుల కోసం తానెప్పుడు పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ క్రమంలోనే, సామాజిక స్పృహను పెంపొందించేందుకు , పౌరులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన `హాఫ్ టికెట్ ఫుల్ నాగరిక్` అనే సరికొత్త ప్రగతిశీల వేదిక తో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలని, ముఖ్యంగా అణచివేతకు గురవుతున్న వారి గళాలకు ఈ వేదిక అండగా నిలుస్తుందని సోనాలి ఆశాభావం వ్యక్తం చేసారు.
వెండితెరపై నటిగా అలరించడమే కాకుండా సమాజంలో నిజమైన మార్పు కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సోనాలి కులకర్ణి ప్రయాణం ఎంతో అభినందనీయం. బాల్యంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకుని నేడు సమాజంలోని ఎందరో బలహీనులకు వాయిస్‌గా మారిన ఆమె నైజం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. మరి ‘హాఫ్ టికెట్ ఫుల్ నాగరిక్’ ద్వారా ప్రారంభించిన సామాజిక ఉద్యమం రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.






































