Advertisementt

చనిపోదామనుకున్న ప్రముఖ రైటర్

Wed 01st Apr 2026 12:44 PM
kona venkat  చనిపోదామనుకున్న ప్రముఖ రైటర్
Thought Of Committing Suicide Says Kona Venkat చనిపోదామనుకున్న ప్రముఖ రైటర్
Advertisement
Ads by CJ

ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా బ్యాండ్ మేళం చిత్రం తో ఆడియన్స్ ముందుకు  వచ్చారు. బ్యాండ్ మేళం నచ్చకపోతే నా తదుపరి సినిమా అంటే తను నెక్స్ట్ రాసే సినిమాని చూడొద్దు అని ప్రమోషన్స్ లో ఛాలెంజ్ చేసారు. కానీ బ్యాండ్ మేళం ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. తాజాగా బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో కోన వెంకట్ నేనొక సమయంలో చనిపోదామనుకున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

నేను ఫస్ట్ ఒక అమ్మాయికి థాంక్స్ చెప్పుకోవాలి. నేను 1997 లో చెన్నై బీచ్ కి చనిపోదామనుకుని వెళ్ళాను. కానీ అక్కడో అమ్మాయి రెండు చేతులు, కాళ్ళు లేవు కానీ బెలూన్స్ అమ్ముకుంటూ జీవిస్తుంది. రేపేమిటో ఆమెకు తెలియదు కానీ అన్నా అన్నా అంటూ నవ్వుతూ  కొనుక్కోమని చెబుతుంది. ఆ అమ్మాయి తమ్ముడనుకుంటా ఆ బండిని తోస్తున్నాడు.

నేను చనిపోదామని 50 టాబ్లెట్స్ తీసుకొని చెన్నై బీచ్ కెళ్ళాను. నా దగ్గర మిగిలిన చివరి డబ్బుతో ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని తాగి చనిపోదామనుకున్నా, కానీ ఆ అమ్మాయిని చూసాక నాకు జీవితంపై ఆశ కలిగింది. ఆ అమ్మాయికి రేపేమిటో  తెలియకపోయినా కష్టపడుతుంది. కానీ నేను చనిపోదామనుకున్నాను. ఆరోజు ఆ అమ్మాయి దేవతలా నన్ను కాపాడింది. 

ఆతర్వాత నేను రచయితగా మారి మంచి సినిమాలకు కథలు రాసాను, అమ్మ నాన్న తమిళమ్మాయి, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్ రాసాను. నేను సక్సెస్ అయ్యాను అంటే ఆ అమ్మాయే  కారణం. ఆ అమ్మాయి నా దృష్టిలో దేవత అంటూ బ్యాండ్ మేళం ఈవెంట్ లో కోన వెంకట్ ఎమోషనల్ అయ్యారు. 

Thought Of Committing Suicide Says Kona Venkat:

Writer Kona Venkat

Tags:   KONA VENKAT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ