ఈ గ్యాప్ లేకపోతె SM తగలడిపోయేది

నిజమే పెద్ది ట్రైలర్ కి #NTRNeel మూవీ గ్లింప్స్ కి గనక ఒక్క రోజు గ్యాప్ గనక లేకపోతె సోషల్ మీడియా తగలడిపోయేది. ఈరోజు సోమవారం మే 18 న రామ్ చరణ్-బుచ్చి బాబు ల పెద్ది ట్రైలర్ ముంబై వేదికగా రిలీజ్ అయ్యింది. మరి పెద్ది అంచనాలను మాటల్లో వర్ణించలేము. అది రిలీజ్ అయ్యాక సోషల్ మిడియా షేక్ అవ్వుద్ది.. అనేలా మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.

ఇక ఏడాది కాలంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతెలా వెయిట్ చేస్తున్నారో అందరికి తెలుసు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే రోజున #NTRNeel కాంబో నుంచి గ్లింప్స్ రాబోతున్నాయి. అది కూడా ఒక రోజు ముందే మే 19 నైట్ 12.05 నిమిషాలకు గ్లింప్స్ వదులుతున్నారు.

మరి రెండు పాన్ ఇండియా అప్ డేట్ లు ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కావడం వారి వారి ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుండగా.. పెద్దికి డ్రాగన్ కి ఆ ఒక్కరోజు గ్యాప్ లేకపోతె ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియా లో చేసే రచ్చకు సోషల్ మీడియా తగలబడిపోయేది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Ram Charan vs Je NTR ,Peddi vs Dragon