కమల్ హాసన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్‌ను పక్కన పెట్టి సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ నేరుగా షూటింగ్ సెట్స్‌కు వెళ్లిన కమల్ హాసన్ సింప్లీసిటీ స్ఫూర్తిగా నిలిచింది.
ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాపై ప్రేమ, బాధ్యత ముఖ్యమని కమల్ హాసన్ మరోసారి నిరూపించారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమ కొత్త ఆలోచనల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశంగా మారింది.
పరిశ్రమ కోసం మార్పు మన నుంచే మొదలుకావాలనే కమల్ హాసన్ తీసుకున్న చొరవకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.
Kamal Haasan ,Kamal Haasan gives up on luxury for Kalki 2 setting an example






































