తెలుగులో జన నాయగన్ కి ఇంత డిమాండా

బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు నేషనల్ అవార్డు విన్ అయిన భగవంత్ కేసరి చిత్రాన్నీ తమిళ స్టార్ హీరో విజయ్ జన నాయగన్ గా రీమేక్ చేసారు. వారు అది రీమేక్ అని చెప్పకపోయినా జన నాయగన్ కంటెంట్ చూస్తే అది భగవంత్ కేసరి రీమేక్ అని స్పష్టంగా అర్ధమవుతుంది.
అలాంటి చిత్రానికి తమిళనాట భారీ క్రేజ్ ఉంటె ఆశ్చర్యం లేదు. కానీ తెలుగులోనూ జన నాయగన్ కు అంత క్రేజ్ ఉంది అంటే మాములు విషయం కాదు. అంటే నిన్నటివరకు జన నాయగన్ క్రేజ్ ఒక ఎత్తు.. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక జన నాయగన్ క్రేజ్ ఒక ఎత్తు అనేలా తెలుగులో జన నాయగన్ పై భారీ డిమాండ్ ఏర్పడింది.
టాలీవుడ్ లో జన నాయగన్ ను కొనేందుకు క్రేజీ నిర్మాణ సంస్థలు పోటీకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ మరియు టీఎస్ రైట్స్ కోసం జాన్ నాయగన్ నిర్మాతలకు బయ్యర్లు రూ.15 కోట్లు ఆఫర్ చేయగా.. జన నాయగన్ నిర్మాతలు మాత్రం 30 నుంచి 35 కోట్ల వరకు ఆశిస్తున్నారట.
మరి రూ.15 కోట్ల డీలే ఎక్కువ అంటే.. రూ.30 కోట్ల డీల్ కావలనడం అత్యాశ అవుతుందేమో. చూద్దాం జన నాయగన్ తెలుగు రైట్స్ కి ఎంత వస్తుందో అనేది.






































