ఈరోజు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. నేటి నుంచి తెలంగాణా వ్యాప్తంగా చికెన్ షాప్స్ బంద్ పెట్టారు. పౌల్ట్రీ కంపెనీలు.. రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాప్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్జిన్ తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తాము ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని, మార్జిన్ తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టంగా మారిందని, వెంటనే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఒకవేళ మార్జిన్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ చేస్తామని హెచ్చరించినట్టుగా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడ్డాయి.
మరి తెలంగాణ లో ముక్క లేనిదే ముద్ద దిగదు. తెలంగాణ ప్రజలకు ప్రతి రోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. రోజు మటన్, ఫిష్ తినలేరు, అందుకే ఎక్కువగా చికెన్ తింటూ ఉంటారు. కానీ ఇప్పుడు చికెన్ దుకాణాలు బంద్ కావడంతో తెలంగాణ ప్రజలు చికెన్ కోసం అల్లాడిపోవాల్సిందే. మరి ఈ బంద్ ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.





స్పిరిట్ ఆలస్యం.. ఎందుకు ప్రభాస్ 
Loading..