పెద్ది ట్రైలర్ - ఆట కాదు పోరాటం

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది చిత్ర మేకర్స్ ముంబై వేదికగా మే 18 న ట్రైలర్ రిలీజ్ చేసారు. పెద్ది ట్రైలర్ లోకి వెళితే.. ఇక్కడ ఏ కుర్రాడిని అడిగినా ఫెవరేట్ ప్లేయర్ పెద్ది నే అని చెబుతున్నారు, పెద్ది ఈ ఏరియా లో ఏమైనా దేవుడి పేరా.. ఫెవరేట్ క్రికెటర్ పెద్ది, ఫెవరేట్ రన్నర్ పెద్ది, ఫెవరేట్ పహిల్వాన్ పెద్ది అంటూ కుర్రాళ్లంతా పెద్ది నామ స్మరణలోనే ఉంటారు.
ఈ కుర్రాళ్లకు పెద్ది గుడిలో దేవుడు కాదు సారూ, గ్రౌండ్ లో దేవుడు అంటూ వచ్చిన డైలాగ్ తో రామ్ చరణ్ ఎంట్రీ అద్దిరిపోయిందీ. ఆటే నా పొగరు అంటూ హీరోయిన్ జాన్వీ కపూర్ ని పొగుడుతూ రామ్ చరణ్ చెప్పే గ్లామర్ డైలాగ్స్, నాకు ఆట గెలవడం కాదు, బ్రతకడం కావాలి అంటూ శివరాజ్ కుమార్ చెప్పిన డైలాగ్, మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారూ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.
రామ్ చరణ్ ఆటగాడిగా ప్రతి లుక్ లో ఇంప్రెస్స్ చేసారు. బాడీ లాంగ్వేజ్ లో, క్రికెటర్ గా, పహిల్వాన్ గా, రన్నర్ గా చరణ్ ప్రతి పాత్రలో కుమ్మేసారు. జాన్వీ కపూర్ గ్లామర్ గా కనిపించింది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు పాత్రలు అన్ని హైలెట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ BGM, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని పెద్ది చిత్ర ట్రైలర్ కి ప్లస్ పాయింట్స్.






































