బాలయ్య బర్త్ డే కి బంపర్ ట్రీట్స్


నందమూరి బాలకృష్ణ బర్త్ డే అంటే అభిమానులకు బిగ్ ఫెస్టివల్ అని చెప్పాలి. బాలయ్య కోసం ఫ్యాన్స్ కేక్ కటింగ్స్, బ్యానర్ లు కట్టడం లాంటి హంగామానే కాదు.. బాలయ్య కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటారు. బాలయ్య కోసం రక్తదానాలు, ఆయన కోసం ప్రత్యేక పూజలు ఇలా ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండవు.

జూన్ 10 న రాబోయే బాలయ్య బర్త్ డే కి ఈసారి అభిమానుల కోసం రెండు స్పెషల్ ట్రీట్స్ ని ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK 111 చిత్రీకరణ దశలో ఉండగా.. ఈచిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

రీసెంట్ గా  బాలయ్య-కొరటాల కాంబో మూవీ నుంచి ఏదో స్పెషల్ ట్రీట్ ఉండబోతుంది అంటున్నారు. అది కూడా బాలయ్య లుక్ ని వదిలేందుకు కొరటాల బాలయ్యతో స్పెషల్ ఫోటో షూట్ ప్లాన్ చేసారని అంటున్నారు. మరి జూన్ 10 న రాబోయే ఆ రెండు ట్రీట్స్ కోసం అభిమానులు మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు.
 

Balakrishna,Bumper treats for Balayya birthday