Advertisementt

NTRNeel మూవీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో

Tue 31st Mar 2026 05:23 PM
tovino thoma  NTRNeel మూవీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో
Malayalam star opts out of NTR-Neel film NTRNeel మూవీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో
Advertisement
Ads by CJ

యంగ్ ఎన్టీఆర్ తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ చిత్ర షూటింగ్ విషయాలేమో కానీ.. ఈ సినిమా లేట్ అవడంతో క్రేజీగా ఈ చిత్రంలో నటించాల్సిన స్టార్ నటులు తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. #NTRNeel మూవీలో ఎన్టీఆర్ తో మలయాళ హీరో తోవినో థామస్ తలపడతారు, ఆయన డ్రాగన్ లో విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం జరగడమే కాదు..

రీసెంట్ గా జోర్డాన్ లో జరిగిన #NTRNeel షూటింగ్ లో తోవినో థామస్ జాయిన్ అయ్యాడు, ఎన్టీఆర్-తోవినో థామస్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్ అన్నారు. కట్ చేస్తే తోవినో థామస్ #NTRNeel మూవీ నుంచి తప్పుకున్నట్లుగా ఆయన రీసెంట్ మూవీ ప్రమోషన్స్ లో రివీల్ చేశారు.

#NTRNeel చిత్రానికి  డేట్స్ కేటాయించడం చాలా కష్టంగా ఉంది. అందుకే నేను ఈ సినిమా చేయడం లేదు. నాకు తెలుగు సినిమాలు చేయాలని చాలా ఇష్టంగా ఉంది. మలయాళ చిత్ర పరిశ్రమలో పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. మలయాళ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాము, కానీ తెలుగులో చిత్రాలను పలు షెడ్యూల్స్‌లో చిత్రీకరిస్తారు. నాకు ఒకేసారి అనేక చిత్రాలు చేయడం ఇష్టం ఉండదు.

ఇక  తెలుగు సినిమాలు చాలా పెద్దవిగా ఉంటాయి. నేను ఒక తెలుగు సినిమా చేస్తూ ఉంటే.. అది నా 4-5 మలయాళ చిత్రాలపై ప్రభావం చూపుతుంది. నా కమిట్‌మెంట్లను ఉల్లంఘించడం చాలా కష్టం. ఒకే షెడ్యూల్‌లో పూర్తయ్యే తెలుగు ఆఫర్ వస్తే, నేను తప్పకుండా చేస్తాను అంటూ తోవినో థామస్ #NTRNeel మూవీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. 

Malayalam star opts out of NTR-Neel film:

 Tovino Thomas opts out of NTR-Neel film

Tags:   TOVINO THOMA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ