బిగ్ డే - అందరి కళ్ళు పెద్ది ట్రైలర్ పైనే

ఈరోజు మే 18 బిగ్ డే. అంటే పెద్ది ట్రైలర్ డే. అందరి కళ్ళు పెద్ది ట్రైలర్ పైనే. 2026 ప్రథమార్ధం అంతా అద్భుతమైన సినిమాలు లేక ప్రేక్షకులు డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. సంక్రాంతి సినిమాలు, ఆతర్వాత ధురంధర్ 2 తప్ప ప్రేక్షకులను అలరించిన సినిమాలు లేవు. ఇక ఇప్పుడు 2026 సెకండ్ హాఫ్ పైనే అందరిలో ఆశలు కనిపిస్తున్నాయి.

అందులో ముందుగా రాబోయే పెద్ది పైనే అందరిలో అంచనాలు ఉన్నాయి. జూన్ 4 న విడుదల కాబోయే పెద్ది ప్రమోషన్స్ ఈరోజు పెద్ది ట్రైలర్ తోనే అఫీషియల్ గా పాన్ ఇండియా మార్కెట్ లో మొదలు కాబోతున్నాయి. పెద్ది చిత్రం ట్రైలర్ అద్భుతం అంటూ మెగాస్టార్ చిరు రివ్యూ ఇచ్చారు. అయన చెప్పినట్టుగా ట్రైలర్ ఉంటె పెద్ది పై అంచనాలు డబుల్ అవుతాయి.

పెద్ది ఓపెనింగ్స్ ట్రైలర్ టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు పెద్ది నుంచి వచ్చిన కంటెంట్ ఒక ఎత్తు, ఇప్పుడు ట్రైలర్ ఒక ఎత్తు. ట్రైలర్ కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పెద్ది ట్రైలర్ ని ఊహకందని వ్యూస్ తో పరుగులు పెట్టించేందుకు ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు.

మరి సోమవారం ముంబై లో జరగబోయే పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, హీరోయిన్ జాన్వీ, శివ రాజ్ కుమార్ లు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Peddi Movie,Peddi Trailer Day