ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela's Dating Rumours, Mother Clears Air!

క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్ - నిజమేమిటంటే

Sreeleela's Dating Rumours, Mother Clears Air!Sreeleela's Dating Rumours, Mother Clears Air!

కొద్ది రోజులుగా క్యూట్ బ్యూటీ శ్రీలీల క్రికెటర్ తిలక్ వర్మ తో ప్రేమలో మునిగి తేలుతుంది. తిలక్ వర్మ తో శ్రీలీల సీక్రెట్ డేటింగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో భీభత్సంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పై అటు తిలక్ వర్మ కానీ, ఇటు శ్రీలీల కానీ రియాక్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.

అయితే శ్రీలీల - తిలక్ వర్మ ల డేటింగ్ రూమర్స్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. శ్రీలీల - తిలక్ వర్మ మధ్యలో ఏమి లేదు, వారు డేటింగ్ లో ఉన్నారు అనేది పూర్తిగా అవాస్తవం. అసలు వాళ్లిద్దరూ ఇప్పటివరకు కనీసం ఒకరినొకరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా అలాంటిది వారెలా డేటింగ్ చేస్తారు అంటూ శ్రీలీల తల్లే స్వయంగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

మరి ఈ గాసిప్స్ ఎలా పుట్టాయో తెలియదు కానీ.. ఈ డేటింగ్ రూమర్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవి కేవలం పుకార్లుగా మిగిలిపోయాయి. 

Sreeleela,