Advertisementt

నటుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం

Mon 30th Mar 2026 10:39 AM
prakash raj  నటుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
Prakash Raj mother passed away నటుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) ఈ రోజు ఉదయం స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. దాంతో ప్రకాష్ రాజ్ కి పలువురు తమ సంతాపం తెలుపుతున్నారు.

ఈరోజు సాయంత్రం బెంగుళూర్ లో ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.

తెలుగు, తమిళ ఇలా పలు ఇండస్ట్రీస్ లో విలక్షణ నటుడిగా ప్రేక్షకులకు దగ్గరైన ప్రకాష్ రాజ్ అటు రాజకీయాలతోను ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. నిత్యం షూటింగ్స్ తో బిజీగా వుండే ప్రకాష్ రాజ్ ఖాళీ సమయాల్లో తన ఫ్యామిలీతో గడుపుతారు. ఇప్పుడు ఆయన తల్లి మరణం ఆయనకి తీరని లోటు. 

Prakash Raj mother passed away:

Actor Prakash Raj 

Tags:   PRAKASH RAJ
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ