ఆ హీరోకి రెండో బ్రేకప్

Hero Breakup With His GirlfriendHero Breakup With His Girlfriend


ఏళ్లతరబడి కలిసి ఉన్న భార్యకు విడాకులిచ్చి మరో ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కోలీవుడ్ హీరో రవి మోహన్ కి మళ్లీ బ్రేకప్ తప్పులేదా, ఆయన ప్రియురాలు కేనీషా రవి మోహన్ కి బ్రేకప్ చెప్పిందా అనేలా కేనీషా ఇండైరెక్ట్ గా ఇచ్చిన నోట్ హాట్ టాపిక్ గా మారింది. భార్య ఆర్తి తో విడిపోయి సింగర్ కేనీషా తో కలిసి తిరిగిన రవి మోహన కి రెండోసారి బ్రేకప్ తప్పలేదు.

కేనీషా అన్ని వదిలి చెన్నై ని విడిచి వెళ్ళిపోతున్నట్టుగా ఇన్స్టా లో పెట్టిన పోస్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది. జయం రవి ఆర్తి తో విడిపోయి కేనీషా తో ఉన్నప్పుడు కేనీషా ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు. భార్యాభర్తలను విడగొట్టింది అంటూ జయం రవి ఫ్యాన్స్ కూడా కేనీషను టార్గెట్ చేసారు.

తాజాగా కేనీషా సోషల్ మీడియా వేదికగా.. ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాను. ఈ కథలోకి నేను ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నాను. కొన్నిసార్లు ప్రపంచంలో మంచి అనేది కనబడదు, అక్కడ స్వార్ధం, అహంకార కథనాలతో నిండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుంది.

నాపై ఇంత నెగిటివిటీని నేను ఊహించలేదు. నేను ఓడిపోయాను. చెన్నై వదిలి వెళ్లిపోతున్నాను. నా సంగీతాన్ని, నా థెరపీని, నా జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని వదిలేస్తున్నాను. నాపై ట్రోల్స్ వచ్చినందు వల్లే నేను భరించలేక సోషల్ మీడియాకి కూడా దూరమవుతున్నాను.

దేవుడు చేయలేనిది కూడా మనిషి చెయ్యగలడు అని నిరూపించారు అంటూ కేనీషా ఇండైరెక్ట్ గా రవి మోహన్ తో బ్రేకప్ చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చింది. మరి భార్య తో విడాకులు, ప్రియురాలితో బ్రేకప్ పాపం రవి మోహన్ కదా.. 

Keneeshaa Francis Post Hints At Split With Ravi Mohan