సూర్య మళ్లీ డిజప్పాయింట్ చేసారు

Suriya disappointed againSuriya disappointed again

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకేలాంటి కథలతో ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నారనే కంప్లైంట్ ఉంది. ఎన్ని సినిమాలు చేసినా అవి ఒకే ఫార్మేట్ లో ఉంటున్నాయి. అదే రివెంజ్ డ్రామా, అదే కత్తి, అదే లుక్ అంటూ ఆయన అభిమానులే నిరాశ పడే సినిమాలు చేస్తున్నారు సూర్య. తాజాగా సూర్య నుంచి వచ్చిన కరుప్పు, వీరభద్రుడు కూడా అదే పంధా లో వచ్చిన సినిమానే.

ప్రొడక్షన్ హౌస్ ఆర్ధికలావాదేవీలతో ఒకరోజు ఆలస్యంగా థియేటర్స్ లో విడుదలైన సూర్య కరుప్పు, వీరభద్రుడు సినిమా చూసిన వారు సూర్య మళ్ళీ డిజప్పాయింట్ చేసారు అంటూ ఆడియెన్ పెదవి విరుస్తున్నారు. వీరభద్రుడు లో సూర్య యాక్టింగ్, సినిమా ఫస్ట్ హాఫ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బావున్నాయి.

విలన్ కేరెక్టర్ వీక్, నేరేషన్ గొప్పగా లేకపోవడం, ఇంప్రెస్స్ చెయ్యని డైలాగ్స్ సినిమాకి మైనస్ లుగా చెప్పడమే కాదు సూర్య లుక్ మరీ రొటీన్ గా ఉన్నాయంటూ ఆయన అభిమానులే నిరాశపడుతున్నారు. రెట్రో ప్లాప్ తర్వాత సూర్య ఏంతో నమ్మకంతో కనిపించిన ఈ చిత్రం కూడా సూర్య కి నిరాశపరిచి ఫలితాన్నే అందించింది.

Suriya Veerabhadrudu Talk