విజయ్ తో పోలిక పవన్ అసహనం

తమిళనాట పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చిన విజయ్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎంతగా వచ్చాయో చూసాం. పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎదురు చూసి చివరికి టీడీపీ తో పొత్తు పెట్టుకుని పార్టీని గెలిపించుకుని డిప్యూటీ సీఎం అయ్యారు, కానీ హీరో విజయ్ సింగిల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా మొదటిసారి గెలిచి సీఎం అయ్యారంటూ పవన్ ని ట్రోల్ చేసారు.
తాజాగా పనిలో పడిన పవన్ ఈరోజు జనసేన సభలో మట్లాడుతూ తనని విజయ్ తో పోలుస్తూ చేస్తున్న కామెంట్లపై అసహనం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో(తమిళనాట) ఉన్న పరిస్థితులు వేరు, ఏపీ లో ఉన్న పరిస్థితులు వేరు. రాజకీయ నాయకులు ఎవరి పరిస్థితులకు తగ్గట్లుగా వారు పని చేస్తారని, ఇద్దరు నాయకులను అలా పోల్చడం సరైనది కాదని స్పష్టం చేశారు.
నేను ఇక్కడ పదేళ్ళపాటు నలిగిపోయాను, ఎందరో రౌడీలను తట్టుకుని నిలబడ్డాను, రెండు చోట్ల నిలబడితే కావాలని ఓడించారు. అందరూ వదిలి వెళ్ళిపోయినా పార్టీ కోసం పోరాడాను. పక్క రాష్ట్రంలో ఎవరో గెలిచారని, వారితో నన్ను పోల్చడం సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.







































