ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి బర్త్‌డే సెన్సేషన్!

వెండితెరపై దశాబ్దాల పాటు నటన, నృత్యం అభినయంతో `ధక్ ధక్ గర్ల్ గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి మాధురీ దీక్షిత్. తాజాగా 59వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆమెకు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ నటి, మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, నటి రవీనా టాండన్ లు మాధురీపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో మాధురీ దీక్షిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని కొన్ని అరుదైన , అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో మాధురి ఎంతో అందంగా , హుందాగా కనిపిస్తున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నమ్రత పోస్ట్ చేసిన ఈ చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాధురి వెండితెరపై సృష్టించిన ప్రభంజనాన్ని మరోసారి గుర్తుచే స్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ కూడా మాధురీ దీక్షిత్‌కు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. మాధురి జీవితం ఎల్లప్పుడూ ఆనందం, ప్రేమ , ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఒకే కాలంలో పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా రాణించిన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం , గౌరవం నేటికీ అలాగే కొనసాగుతుండటం విశేషం. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మధ్య వృత్తి పరమైన పోటీ ఉన్నా? వ్యక్తిగత జీవితంలో ఒకరినొకరు ఎంతగా గౌరవిస్తారో? రవీనా పోస్ట్ నిరూపించింది.







































