కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతార చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యి నేషనల్ అవార్డు సాధించిన దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి కాంతార 1 తర్వాత మరింతగా క్రేజ్ సంపాదించారు. దానితో ఆయన పారితోషికం అమాంతం పెంచేయడంతో కన్నడ నిర్మాతలెవరూ రిషబ్ శెట్టి తో సినిమాలు చేసునేందుకు సిద్దమవ్వకపోయినా సౌత్ మేకర్స్ రిషబ్ శెట్టి కోసం కోట్లు దారపోస్తున్నారు.
మరోపక్క రిషబ్ శెట్టి తను చేసిన సినిమా నటులతో విభేదాలు పెట్టుకుంటున్నాడు. గతంలో కిర్రాక్ పార్టీ హీరోయిన్ రష్మిక కి రిషబ్ శెట్టి కి మద్యన కోల్డ్ వార్ నడిచింది. ఇప్పుడు కాంతార నిర్మాతలు, నటులతో రిషబ్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయంశముగా మారింది. కాంతార ప్రొడ్యూసర్స్ హోంబులే ఫిలిమ్స్ తో విభేదాల వలన వారిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు తనకు ఎంతో అండగా నిలబడిన, తనకు ఎంతో సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టిని కూడా అన్‌ఫాలో చేశారు.
అంతేకాకుండా కాంతార 1 హీరోయి రుక్మిణి వసంత్ ని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో అన్ ఫాలో చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అది చూసిన నెటిజెన్స్ షూటింగ్ సమయంలో రుక్మిణి వసంత్ కి, రిషబ్ కి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా అని మాట్లాడుకుంటున్నారు. ఇక కాంతార టీమ్ మొత్తంతో రిషబ్ శెట్టి ఇలా అంటీముట్టనట్టుగా ఉండడం మాత్రం అందరిలో ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది.




ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పారు 

Loading..