Advertisement

న‌టి విడాకులు ఎట్ట‌కేల‌కు అధికారికం

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం పరిశ్రమలో చ‌ర్చ‌గా మారింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన అనుమానాలు చివరకు వారి సంయుక్త ప్రకటనతో నిజమని తేలాయి.

తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారుతున్న తరుణంలో పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, విడిపోయినా భవిష్యత్తులో మంచి స్నేహితులుగా కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తమ ఏకాంతానికి భంగం కలిగించవద్దని అభిమానులను, మీడియాను వారు కోరారు.

మౌనీ రాయ్ పరపతిని, డబ్బును ఆమె భర్త వాడుకుని మోసం చేశాడంటూ వెలువడిన కొన్ని కథనాలను ఈ జంట తీవ్రంగా ఖండించింది. కేవలం సంచలనం కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తమ సంబంధం గురించి వస్తున్న కల్పిత కథనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వారు అసహనం వ్యక్తం చేశారు.

వివాహ బంధం ముగిసినా ఒకరిపై ఒకరికి ఉన్న మర్యాదను కాపాడుకుంటూ.. సామరస్యపూర్వకంగా విడిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ అధికారిక ప్రకటనతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పుకార్లకు చెక్ పడినట్లయింది.

Mouni Roy confirms divorce with Suraj NambiarMouni Roy confirms divorce
Advertisement
Advertisement