Advertisementt

ప్రభాస్ ఫౌజి లో క్రేజీ సీనియర్ హీరోయిన్

Sat 28th Mar 2026 11:07 AM
jaya prada  ప్రభాస్ ఫౌజి లో క్రేజీ సీనియర్ హీరోయిన్
Jaya Prada in Fauji ప్రభాస్ ఫౌజి లో క్రేజీ సీనియర్ హీరోయిన్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజి చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ ని ఫస్ట్ లుక్ అప్పుడే చూసాం. సోల్జర్ గా డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్న ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తుంది. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ ఫౌజి గురించి ఏ ఇతర అప్ డేట్ ఇవ్వట్లేదు మేకర్స్. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిన ఫౌజి పై మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ని సిద్ధం చేస్తున్నారట. ఇకపోతే ఫౌజి చిత్రంలో క్రేజీ మాజీ హీరోయిన్ జయప్రద నటిస్తున్నట్లుగా ఆమె రివీల్ చేసారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఫౌజి లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పారు. మరి జయప్రద కీలక పాత్రలో కనిపించడం అంటే మాములు విషయం కాదు.

అయితే అది ప్రభాస్ కి తల్లి పాత్ర అని, జయప్రద-ప్రభాస్ మధ్యన వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని యూనిట్ వర్గాల సమాచారం. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ నటి ఇప్పుడు ప్రభాస్ ఫౌజి కోసం రావడం, అది కూడా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా జరిగిన చాలా ఏళ్లకు కనిపించడం అన్ని ఆసక్తికరంగా మారాయి.

Jaya Prada in Fauji:

Jaya Prada is said to be playing Prabhas mother role in Fauji

Tags:   JAYA PRADA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ