Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul recently reacted to the online discussion around husband Jackky

భర్త వ్యాఖ్యలపై పుకార్లకు భార్య‌ చెక్!

బాలీవుడ్ జంట రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై రకుల్ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ తమ బంధం గురించి మాట్లాడుతూ సిట్యుయేషన్ షిప్ అనే పదాన్ని వాడటం నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా అలాంటి పదాన్ని వాడటంపై రకరకాల పుకార్లు షికారు చేయడంతో రకుల్ ఈ విషయంలో అసలు నిజమేంటో స్పష్టం చేస్తూ విమర్శకులకు ధీటైన సమాధానం ఇచ్చింది.

జాకీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ మాటలను సందర్భోచితంగా కాకుండా  ఒక ముక్కను మాత్రమే తీసుకుని వైరల్ చేశారని రకుల్ పేర్కొన్నారు. తమ వ్యక్తిగత జీవితం గురించి తాము ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటామో బయటి వారికి తెలియదని  ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక పదాన్ని పట్టుకుని తమ బంధంపై తీర్పులు ఇవ్వడం సరికాదని తాము ఎంతో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సెలబ్రిటీల మాటలను సోషల్ మీడియాలో ఏ విధంగా వక్రీకరిస్తారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన వివరణతో  వివాదానికి తెరపడినట్లయింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని రకుల్ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రస్తుతం ఈ జంట  వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా గడుపుతున్నారు.
 

Rakul Preet Singh recently reacted to the online discussion around husband Jackky BhagnaniRakul recently reacted to the online discussion around husband Jackky
Advertisement
Advertisement