Advertisementt

సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో

Fri 27th Mar 2026 11:25 AM
srinivas  సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో
A Very Simple Wedding Plan For Young Hero సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో
Advertisement
Ads by CJ

సినిమా సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఏ రేంజ్ లో చేసుకుంటారో, ఎంత ఘనంగా నిర్వహిస్తారో, ఆ పెళ్లిళ్లకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది హాజరవుతారో అనే విషయం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన రెండు పెళ్లిళ్ల గురించి ఇప్పటికి జనాలు మాట్లాడుకుంటున్నారు. అదే అల్లు వారింట శిరీష్ వివాహం, దేవరకొండ ఇంట విజయ్ దేవరకొండ-రష్మీకల వివాహం.

కానీ ఇప్పుడొక కుర్ర హీరో తన పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోబోతున్నాడట. అతనే బెల్లంకొండ శ్రీనివాస్. రీసెంట్ గానే తను ప్రేమించిన కావ్య రెడ్డి తో సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్న బెల్లకొండ శ్రీనివాస్ వివాహాన్ని కూడా అంతే సింపుల్ గా పెద్ద తిరుపతిలో చేసుకోబోతున్నాడట. 

బెల్లంకొండ సురేష్ ఫేమస్ నిర్మాత, బెల్లంకొండ శ్రీనివాస్ పాపులర్ హీరో. అయినప్పటికీ తన పెళ్లికి ఏప్రిల్ 29 న తిరుపతిలో చేసుకుని మే 1 న హైదరాబాద్ లో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పెళ్లి సింపుల్ గానే అయినా.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తారని, ఈ వేడుకకు సినీ ప్రముఖులని ఆహ్వానించబోతున్నారని టాక్ వినబడుతుంది.

A Very Simple Wedding Plan For Young Hero:

Bellamkonda Srinivas wedding date locked

Tags:   SRINIVAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ