పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పెద్ది. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. మరి మెగా హీరో బర్త్ డే అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. అందులోను ఈరోజు శ్రీరామనవమి కావడం, అదే రోజు చరణ్ బర్త్ డే కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు మాములుగా లేవు.
మరి ఆ రేంజ్ లోనే మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వాలి కదా.. దర్శకుడు బుచ్చిబాబు మెగా అభిమానుల కోసం పెద్ది నుంచి పహిల్వాన్ గ్లింప్స్ ని చెర్రీ బర్త్ డే ట్రీట్ గా అభిమానులకు అందించాడు. రామ్ చరణ్ బీస్ట్ మోడ్ లో కుస్తీ పడుతుంటే.. థియేటర్స్ లో అయితే విజిల్స్ పడాల్సిందే. కుస్తీ అంటే బంతితో బ్యాట్ కి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకెదురెళ్ళే ఆట.. ఇప్పుడు చెప్పు ఉంటావా.. పోతావా..
అంటూ బ్యాగ్రౌండ్ లో డైలాగ్ వస్తుంటే రామ్ చరణ్ పహిల్వాన్ కావడం కోసం తీసుకుంటున్న ట్రైనింగ్ ని చూపిస్తూ చరణ్ తో పవర్ ఫుల్ గా చూడమ్మీ ఆటే నా పొగరు అంటూ డైలాగ్ చెప్పించారు. అసలు రామ్ చరణ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
రెహమాన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, బుచ్చిబాబు మేకింగ్ అన్ని పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ లో హైలెట్ అయితే అన్నటికన్నా రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ మాత్రం మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ ను ఫుల్ గా ఇంప్రెస్స్ చేసింది.




వారానికే చేతులెత్తేసిన ఉస్తాద్ 

Loading..