Advertisementt

రామ్ చరణ్ కష్టం వృధా కాకూడదు

Thu 26th Mar 2026 10:25 PM
ram charan  రామ్ చరణ్ కష్టం వృధా కాకూడదు
Ram Charan injured while shooting an action sequence for Peddi రామ్ చరణ్ కష్టం వృధా కాకూడదు
Advertisement
Ads by CJ

కంటి పైన దెబ్బతగిలినా కుట్లు వేయించుకుని ఓ ప్లాస్టర్ వేసుకుని రామ్ చరణ్ యధావిధిగా పెద్ది షూటింగులోకి రావడం, అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకోవడం పట్ల మెగా ఫ్యాన్స్ నిజంగా ఫిదా అవుతున్నారు. రేపు రామ్ చరణ్ బర్త్ డే. నిన్న పెద్ది సెట్ లో రామ్ చరణ్ గాయపడ్డారు. కానీ ఈరోజు ఆయన కంటి పై ప్లాస్టర్ తో పెద్ది సెట్ లోకి రావడం హ్యాపీనే.

ఆయన అంత కష్టపడుతున్నారు. మరి ఆయన కష్టం వృధా కాకుండా పెద్ది అనుకున్న సమయానికి థియేటర్స్ లోకి వచ్చేయ్యాలి. ఏప్రిల్ 30 టార్గెట్ గా పెద్ది షూటింగ్ హడావిడిగా ముగిస్తున్న సమయంలో రామ్ చరణ్ సెట్ లో గాయపడ్డారు. చిన్నపాటి సర్జరీ చేసి కంటి పై భాగంలో రెండు మూడు స్టిచెస్ వేశారు వైద్యులు.

అదే మనకి దెబ్బతగిలితే రెండుమూడు రోజులు మంచం దిగం, కానీ రామ్ చరణ్ మాత్రం పెద్ది టార్గెట్ దృష్టిలో ఉంచుకుని దెబ్బ తగిలిన మరుసటి రోజే సెట్ లోకి వచ్చేసారు. ఆ దెబ్బతోనే ఆయన పని చేస్తున్నారు. మరి ఆయన కష్టం వృధా కాకూడదు అనేది మెగా ఫ్యాన్స్ కోరిక. అన్ని అడ్డంకులు అధిగమించి పెద్ది ఏప్రిల్ 30 కి పెద్ది వచ్చే య్యాలని బలంగా మనము కోరుకుందాం. 

Ram Charan injured while shooting an action sequence for Peddi:

Ram Charan enters Peddi sets

Tags:   RAM CHARAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ