ఇప్పుడు ప్రతి భాష హీరో చూపు, అలాగే ఆడియన్స్ చూపు ఒకే ఒక్క దర్శకుడి పైనే ఉంది. ఆ దర్శకుడే ధురంధర్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన ఆదిత్య ధర్. నిన్నమొన్నటివరకు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఉరి అప్పుడు వినిపించినా.. ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 తో ఆయన పేరు మార్మోగిపోయింది.
ధురంధర్ 2 చిత్రానికి వస్తున్న రెస్పాన్స్, సౌత్ సెలబ్రిటీస్ నుంచి ధురంధర్ కి వస్తున్న అప్రిశేట్స్ అన్ని చూసి ఇప్పుడు ఆదిత్య ధర్ తన నెక్స్ట్ మూవీ కి ఏ హీరోని ఎంచుకుంటాడు అనే క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే అల్లు అర్జున్, ఆదిత్య ధర్ తో కాంటాక్ట్ లో ఉన్నారని అన్నా అది జస్ట్ పీఆర్ స్టంట్ అని అందులో నిజం లేదు అని తెలుస్తుంది.
ధురంధర్ 2 తర్వాత ఆదిత్య ధర్ ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తాడు, అశ్వద్దామా అంటున్నారు, దానికి ఎంత బడ్జెట్ అంటాడు, అసలు ఏ హీరోకి కథ చేబుతాడనే విషయంలో అందరి చూపు ఆదిత్య ధర్ పైనే ఉంది. కాని ఆదిత్య తన తదుపరి మూవీ ఎలా, ఏ హీరోతో చెయ్యాలనే ఆలోచనలో లేడట, ఆయన ప్రస్తుతం ధురంధర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
మరి ఆదిత్య ధర్ నెక్స్ట్ మూవీ పై అంచనాలు ఎలా ఉంటాయో అనేది ఊహించడము కష్టమే. అదే.. ప్రాజెక్ట్ అయినా పాన్ ఇండియా మార్కెట్ లో సన్సెషన్ క్రియేట్ చెయ్యడం ఖాయం.




కృతి శెట్టికి బంపర్ ఆఫర్ 

Loading..