చికెన్ కోసం నాన్ వేజ్ ప్రియులు షాప్ లకు పురుగులు పెడుతున్నారా.. అయితే వాళ్లకు ఇప్పుడొక షాకింగ్ న్యూస్. ఇప్పటికే చికెన్ రేట్లు ఆకాశాన్ని చూస్తున్నా నాన్ వేజ్ ప్రియులు ఎలాగో చికెన్ కొనుక్కుని తింటున్నారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. కారణం హైదరాబాద్ లో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ బంద్ పెడుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి చికెన్ షాపులు బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. కారణం పౌల్ట్రీ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వక పోవడం వల్ల వ్యాపారులమంతా నష్టపోతున్నామని, దీనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లు పలు చోట్ల పోస్టర్లు వెలిసాయి.
ఇవ్వాల్సిన దానికన్నా రూ.20 త్తగ్గించి ఇస్తున్నారని,వెంటనే తగ్గించిన మార్జిన్ సరిచేయాలని, అప్పటి వరకు చికెన్ షాప్స్ బంద్ కొనసాగుతుందని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన చెయ్యడంతో నాన్ వేజ్ ప్రియులు ముఖ్యంగా చికెన్ ప్రియులు తెగ ఫీలైపోతున్నారు.





పెద్ది ర్యాంపేజ్ గేమ్ గ్లింప్స్
Loading..