Advertisementt

దురంధ‌ర్ దౌడ్..మూడు రోజులు 500 కోట్లు

Sun 22nd Mar 2026 08:15 PM
dhurandhar 2  దురంధ‌ర్ దౌడ్..మూడు రోజులు 500 కోట్లు
Dhurandhar 2 Box Office Collection Day 3 దురంధ‌ర్ దౌడ్..మూడు రోజులు 500 కోట్లు
Advertisement
Ads by CJ

బాక్సాఫీస్ వద్ద `ధురంధర్ 2` దౌడ్ కొన‌సాగుతోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ విడుదలైన  మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజైన శనివారం నాటి వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. శాక్‌నిల్క్ నివేదిక ప్రకారం శనివారం ఒక్కరోజే దేశీయంగా 113 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో మూడు రోజుల మొత్తం భారతీయ నెట్ వసూళ్లు రూ. 296.27 కోట్లకు చేరాయి.

దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రం ప్రభంజనం కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు 96.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో  గ్లోబల్ కలెక్షన్లు 501.04 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 4,405 షోలతో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదలైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ మూడో రోజు అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై 23.70 కోట్లు వసూలు చేయడం సినిమాపై ఉన్న  క్రేజ్‌కు నిదర్శనం.

ప్రస్తుత కలెక్షన్ల వేగం చూస్తుంటే? ఈ చిత్రం అంతిమంగా రూ. 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక చిత్రం `దంగల్ ( 2070 కోట్లు) మాత్రమే. అదే బాటలో సాగుతూ `ధురంధర్ 2` త్వరలోనే `బాహుబలి 2`, `కేజీఎఫ్ 2`, `జవాన్` మరియు ఈ సిరీస్‌లోని మొదటి భాగం ( 1307 కోట్లు) రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ స్పై థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Dhurandhar 2 Box Office Collection Day 3:

Dhurandhar 2 storms past 500 crore

Tags:   DHURANDHAR 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ