యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కిన దేవర చిత్రం విడుదల సమయంలో పర్మిషన్స్ లేవు అంటూ దేవర చిత్రాన్ని ప్రమోట్ చెయ్యకుండానే థియేటర్స్ లో విడుదల చెయ్యడం పై ఆ సినిమా నిర్మాతలైన #NTRArts ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా తిట్టిపోశారు. దేవర ఈవెంట్ ని ఓ హోటల్ లో ప్లాన్ చెయ్యడం, అది క్యాన్సిల్ అవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇప్పటికి బాధపెడుతుంది.
అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చిన దేవర చిత్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ ని కళ్లారా చూసుకోవాలి, ఆయన స్పీచ్ వినాలని అభిమానులు ఆశపడగా.. నిర్మాతలు దేవర ప్రమోషన్స్ ని లైట్ తీసుకోవడమే వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కాన్సెర్ట్ హైదరాబాద్ లో జరిగింది.
శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి జరిగిన అనిరుద్ రవిచందర్ కాన్సెర్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనిరుద్ లైవ్ కాన్సెర్ట్ కోసం అభిమానులు ఎగబడ్డారు. అనిరుద్ పాడిన పాటలను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. బ్లాక్ బస్టర్ అయిన ఆ కాన్సెర్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుత కుత ఉడికిపోతున్నారు.
రేయ్ పాపిష్టోడా @NTRArtsOfficial చూస్తున్నావా రా 😭 ఎలాంటి కాన్సర్ట్ మిస్ అయ్యామో! అప్పుడే ప్రాపర్ ప్లానింగ్ చేసి ఉంటే దేవర ఈవెంట్ మాకు లైఫ్ లాంగ్ మెమరీ అయి ఉండేది 😭🔥 అంటూ ట్వీట్లు వెయ్యడం హాట్ టాపిక్ అవుతోంది.





ఎట్టకేలకు సమంత ఛాన్స్ కొట్టేసిందా

Loading..