మనుగడ కోసమే ఏడాదికి నాలుగు సినిమాలు!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏడాదికి నాలుగు సినిమాలు చేయడంపై తరచుగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన వేగంగా షూటింగ్‌లు పూర్తి చేయడం వల్ల నాణ్యత దెబ్బతింటుందని కొందరు అభి ప్రాయపడుతుంటారు. అయితే ఈ విషయంలో నిర్మాత ఏక్తా కపూర్ అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా? థియేటర్ల మనుగడ సాగాలన్నా? క్రమం తప్పకుండా సినిమాలు చేసే నటులు అవసరమని స్పష్టం చేశారు. అక్షయ్ కుమార్ వంటి వారు వేగంగా సినిమాలు చేయడం వల్లే పరిశ్రమలో నిరంతరం పని జరుగుతుందని దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని సమర్థించారు.
పరిశ్రమ బాగుండాలంటే కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా? నిరంతరాయంగా సినిమాలు విడుదలవ్వాలని ఏక్తా అభిప్రాయపడ్డారు. ఒక నటుడు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తే? ఆ గ్యాప్‌లో థియేటర్ల వ్యవస్థ , ఇతర సినీ విభాగాలుకు చాలా ఇబ్బందింగా ఉంటుందన్నారు. అక్షయ్ కుమార్ క్రమశిక్షణను, సమయ పాలనను ప్రశంసిస్తూ ఆయన పనితీరును స్పూర్తిగా తీసుకుని ఇతర నటులు పనిచేయాలని సూచించారు. పరిశ్రమను ఎకో సిస్టమ్ గా చూస్తే? అందులో రెగ్యులర్‌గా సినిమాలు చేసే నటులే వెన్నెముక అని బల్లగుద్ది చెప్పారు.
అక్షయ్ కుమార్ శైలిని విమర్శించే వారికి ఏక్తా కపూర్ సమాధానం ఓ కొత్త కోణాన్ని పరిచయం చేసింది. సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు. అది లక్షలాది మంది ఆధారపడిన ఒక వ్యాపారం అని ఆమె గుర్తు చేశారు. హీరోలు ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద రొటేషన్ జరుగుతుందని ఇది పరోక్షంగా సినిమా రంగానికి మేలు చేస్తుందని విశ్లేషించారు. స్టార్ హీరోల వేగం పరిశ్రమకు భారంగా కాకుండా వరంగా మారాలని ఏక్తా కపూర్ ఆకాంక్షించారు.






































