కూటమి ప్రభుత్వం 23 నెలలు - 100 విజయాలు

కూటమి ప్రభుత్వం @ 23 నెలలు - 100 విజయాలు
సంక్షేమం, సామాజిక భద్రత :
1. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ – నెరవేరిన ఎన్నికల హామీలు
2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
3. స్త్రీ శక్తి : మహిళలకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం - 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6 వరకు)
4. దివ్యాంగ శక్తి : దివ్యాంగులకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం – 20.51 లక్షల ప్రయాణాలు
5. దీపం 2 పథకం : ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ - ఇప్పటికి 4 కోట్ల సిలిండర్లు.
6. అన్న క్యాంటీన్ : రాష్ట్రంలో 269 ఏర్పాటు - 9.15 కోట్ల భోజనాలు (మే 6 నాటికి)
7. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ
8. ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా వ్యయం
9. మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
10. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000... రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
11. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు
12. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్ల అందజేత
13. P 4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూత
14. 23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత... మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ :
15. మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు
16. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
17. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ
18. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
19. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు
20. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు
21. ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
22. వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం
23. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు
24. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
25. చేనేతలకు ఉచిత విద్యుత్ : నెలకు మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు
26. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం
27. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
28. సోలార్ రూఫ్ టాప్‌కు బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
29. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు – మరో 5 లక్షల మంది లక్ష్యం
నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం :
30. మెగా DSC రిక్రూట్మెంట్ - ముఖ్యమంత్రి తొలి సంతకం, 15,941 టీచర్ పోస్టుల భర్తీ
31. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు
32. 10 వేలకు పైగా పోస్టులతో కొత్తగా జాబ్ కేలండర్ విడుదల
33. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు
34. మహిళా ఉద్యోగులకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మెటర్నిటీ లీవ్
రాజధాని, మౌలిక సదుపాయాలు :
35. భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్
36. రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం
37. విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం
38. మూలపేట - వైజాగ్ - కాకినాడ బీచ్ రోడ్, నాగపూర్ – అమరావతి హైవే నిర్మాణం
39. హైదరాబాద్ - అమరావతి - చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా
40. రికార్డు స్థాయిలో బెంగుళూరు - అమరావతి హైవే పనులు
41. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ కింద గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
42. అడవితల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4జీ నెట్వర్క్ సౌకర్యం
43. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు
44. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి
45. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం
46. జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి
47. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు – విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు గెజిట్
48. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు
పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ :
49. 28 నూతన పాలసీలు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు
50. ఒక్క ఏడాదికి దేశంలోని పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు
51. CII సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు
52. 17 SIPB సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు
53. 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
54. విశాఖ IT హబ్ – TCS ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
55. రాజధానిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం
56. కాకినాడలో AM గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన… రెండేళ్లలో గ్రీన్ అమోనియా ఎగుమతి
57. రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు
58. శ్రీ సిటీలో రూ.5 వేల కోట్లతో LG, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
59. అనకాపల్లి జిల్లాలో రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన
60. అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
61. విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌కు శంకుస్థాపన
62. రూ.1 లక్షల కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు
కీలక నిర్ణయాలు-సంస్కరణలు :
63. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కి పైగా CSS పథకాల పునరుద్ధరణ
64. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం... పెరిగిన మూలధన వ్యయం
65. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత
66. తిరుమల సహా దేవాలయాల్లో సంస్కరణలు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
67. రుణాల రీ షెడ్యూల్‌తో ప్రభుత్వంపై తగ్గిన వడ్డీల భారం
68. 50 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్ల బకాయిల చెల్లింపులు
69. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం
70. చెత్త పన్ను రద్దు - దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు
71. ప్రతీ నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’, డోర్ టు డోర్ కలెక్షన్, స్వచ్ఛ రథాలు
72. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై నిషేధం, నెట్ జీరో లక్ష్యంగా కార్యాచరణ
వ్యవసాయం, రైతు సంక్షేమం :
73. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ
74. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు
75. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం - ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
సమర్ధ నీటి నిర్వహణ :
76. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ, కుప్పానికి సాగు నీరు
77. రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు
78. సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్ల వ్యయం
79. శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి
80. రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం
81. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి
82. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి - ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు
83. శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్
84. చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి
85. సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు
86. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు
87. మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర- 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
డిజిటల్ గవర్నెన్స్ :
88. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ
89. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలు
విద్య, వైద్య రంగాలు :
90. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
91. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు - మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
92. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ‘ముస్తాబు’ వంటి వినూత్న కార్యక్రమాలు
93. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు
విద్యుత్, గ్రీన్ ఎనర్జీ :
94. గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్‌కు అంకురార్పణ
95. యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు – మరో 0.30 పైసలు తగ్గింపు లక్ష్యం
96. EVలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు
97. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు
శాంతి భద్రతలు :
98. తగ్గిన క్రైమ్ రేట్ – మహిళల భద్రతకు ప్రాధాన్యత
99. గంజాయి-డ్రగ్స్ పై ఉక్కుపాదం- ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
100. అగ్నిమాపక శాఖ బలోపేతం – రూ. 34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు






































