Advertisementt

ఫైనల్లీ పెద్ది ఐటమ్ హీరోయిన్ ఫిక్స్

Sat 21st Mar 2026 10:13 PM
mrunal thakur  ఫైనల్లీ పెద్ది ఐటమ్ హీరోయిన్ ఫిక్స్
Mrunal Thakur steps in for special song in Peddi ఫైనల్లీ పెద్ది ఐటమ్ హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలోని ఐటెం సాంగ్ పై నిన్నటివరకు ఏవేవో ప్రచారాలు తెరపైకి వచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ ని మించి పెద్ది చిత్రంలో ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు, పెద్ది ఐటెం సాంగ్ లో రామ్ చరణ్ పక్కన ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ కాలు కదపనున్నారు అంటూ చాలానే మాట్లాడారు.

బుచ్చిబాబు ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరో ఫైనల్ చేస్తున్నారు అని కూడా అన్నారు. ఇక మొదటి నుంచి పెద్ది చిత్రంలోని ఐటమ్ సాంగ్ కోసం క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఐటెం సాంగ్ కోసం ఫైనల్ గా మృణాల్ ఠాకూర్ నే రామ్ చరణ్ సరసన కాలు కదిపేందుకు కంఫర్మ్ చేసారు మేకర్స్.

త్వరలోనే రామ్ చరణ్-బుచ్చిబాబు తో కలిసి ఐటెం సాంగ్ కోసం పెద్ది సెట్ లో మృణాల్ జాయిన్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు కనిపించిన పుకార్లు ఇకపై మృణాల్ ఠాకూర్ న్యూస్ తో ఆగాల్సిందే. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపిస్తుండగా.. పెద్ది కి విలన్ గా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. 

Mrunal Thakur steps in for special song in Peddi:

Mrunal Thakur - Peddi

Tags:   MRUNAL THAKUR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ