ఫౌజీ పెండింగ్ 25 శాతమేనా

ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `ఫౌజీ` గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయిందిట. కేవలం 25 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉండటంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల ప్రణాళికలో నిమగ్నమ వుతున్నారని సమాచారం. మిగిలి ఉన్న కొద్దిపాటి షూటింగ్‌లో భాగంగా మూడు భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించాల్సి ఉందిట.
ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని వీటి కోసం ప్రత్యేకమైన సెట్లు, విదేశీ నిపుణులను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా రాబోయే షెడ్యూల్స్‌లో పూర్తి చేయనున్నారుట. ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? ఈ సినిమాకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ డేట్లను సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ముగింపు నాటికే `ఫౌజీ`ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. యుద్ధం - ప్రేమ నేపథ్యంలో సాగే కథపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని స్టిల్స్ అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. డిసెంబర్ నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం శరవేగంగా పని చేస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






































