Advertisementt

ఫైనల్లీ ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్

Sat 21st Mar 2026 10:37 AM
dhurandhar 2  ఫైనల్లీ ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్
Finally Dhurandhar 2 Telugu version released ఫైనల్లీ ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్
Advertisement
Ads by CJ

ధురంధర్ క్రేజ్ చూస్తే ఒక హిందీ సినిమా కోసం ఇంతిలా వెయిట్ చేయడమా అని అనిపించకమానదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ధురంధర్ చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు మార్చ్ 19 న భారీ అంచనాలతో భారీ హైప్ నడుమ విడుదలైన ధురంధర్ 2 తెలుగు ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసింది.

మార్చ్ 19 న తెలుగు ఆడియన్స్ కి ధురంధర్ 2 తెలుగు వెర్షన్ మాత్రమే కాదు తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రాలేదు. కంటెంట్ డెలివరీలో జాప్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో షోలు రద్దయ్యాయి. దానితో తెలుగు ప్రేక్షకులు ఫుల్ గా అయ్యారు. చాలామంది హిందీ వెర్షన్ ని వీక్షించిన సాటిస్ఫాయ్ అవ్వలేకపోయారు.

అటు ధురంధర్ 2 మేకర్స్ కి ఇది పెద్ద దెబ్బె. పాన్ ఇండియా లోని ప్రతి భాషలోకి ధురంధర్ 2 గనక అనుకున్న సమయానికే అందుబాటులోకి వచ్చి ఉంటే ఇంకా కలెక్షన్స్ కనిపించేవి. ఇక ఇప్పుడు ధురంధర్ 2 తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ వినిపించారు. తాజాగా ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి అనుమతులు పొందారు.

ఇపుడు ఏ సమస్య లేకుండా ధురంధర్ 2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బుక్ మై షో లో తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ మొదలైపోయాయి. 

Finally Dhurandhar 2 Telugu version released:

Dhurandhar 2 which is having a delayed release in Telugu

Tags:   DHURANDHAR 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ