గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్లో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనీ వేదికగా ఈ చిత్ర ప్రమోషన్లను గ్రాండ్‌గా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ ద్వారా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా ఆస్కార్ విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ నిలవబోతున్నారు. `పెద్ది` చిత్రానికి సంగీతం అందిస్తున్న రెహ్మాన్ ఐపీఎల్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ వేడుకలో సినిమాలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌ను లేదా థీమ్ మ్యూజిక్‌ను ఆయన ఆలపించే అవకాశం ఉందని సమాచారం. క్రీడలు - వినోదం కలగలిసిన ఈ వేదికపై రెహ్మాన్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే? ప్రపంచమంతా మరోసారి రామ్ చరణ్ సినిమా వైపు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే `పెద్ది` చిత్రానికి ఐపీఎల్ కంటే ఉత్తమమైన ప్రమోషన్ ప్లాట్‌ఫారమ్ మరొకటి ఉండదు. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ , రెహ్మాన్ సంగీతం వెరసి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఐపీఎల్ హంగామాతో `పెద్ది` మేనియా దేశవ్యాప్తంగా మొదలుకానుంది.





రాశి ని భలే మోసం చేసావ్ హరీష్ 
Loading..