Advertisementt

పెద్ది ఎందుకింత కన్ఫ్యూజన్

Fri 20th Mar 2026 04:54 PM
peddi  పెద్ది ఎందుకింత కన్ఫ్యూజన్
Peddi Postpone rumours పెద్ది ఎందుకింత కన్ఫ్యూజన్
Advertisement
Ads by CJ

పెద్ది విషయంలో ఏం జరుగుతుంది. మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 30 కి వెళ్ళింది. ధురంధర్ 2 వల్ల పోస్ట్ పోన్ అన్నా అప్పటికి పెద్ది షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో సినిమాని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు మేకర్స్. ఇపుడు మరోసారి ఏప్రిల్ 30 కి కూడా పెద్ది రాకపోవచ్చు, మే కానీ జూన్ కానీ విడుదల ఉండొచ్చనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

కారణం పెద్ది షూటింగ్ బ్యాలెన్స్ వుండడం, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం, స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ లను ఇంకా ఎంపిక చెయ్యకపోవడం, ఆ సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టకపోవడంతో పెద్ది చిత్రం డెఫనెట్ గా వెనక్కి తగ్గుతుంది అనే అనుమానాలు తలెత్తడంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

కానీ పెద్ది చిత్ర బృందం మాత్రం ఈసారి డేట్ మార్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా సినిమా ఏప్రిల్ 30 నే విడుదల అంటున్నారు. అందుకే డే అండ్ నైట్ పెద్ది షూటింగ్ పూర్తి చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు డే రాత్రనక పగలనక పని చేస్తున్నాడు. పెద్ది విడుదలలో ఎలాంటి డౌట్ లేదు సినిమా ఏప్రిల్ 30 ఫిక్స్ అంటున్నారు.

Peddi Postpone rumours:

Peddi Movie

Tags:   PEDDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ