ఫస్ట్ మూవీ తోనే డిజప్పాయింట్ చేసింది

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రతి భాషలోనూ మంచి విజయాలను సాధించింది. సాయి పల్లవి గ్లామర్ గా కనిపించదు, అందాలు ఆరబోయదు అయినా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అదే ఆమె బలం.
అదే విధంగా హిందీ చిత్ర సీమ కన్ను సాయి పల్లవి పై పడింది. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నితీష్ తివారి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి ని సీత పాత్రలో కనిస్తుంది. ఈలోపే ఆమె మొదటగా ఒప్పుకున్న ఏక్ దిన్ సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆమిర్ ఖాన్ తన కొడుకును హీరోగా పెట్టి చేసిన ఏక్ దిన్ గత వారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సాయి పల్లవి సినిమా ఒప్పుకుంటే అది హిట్ అనే నమ్మకం చాలామందిలో ఉంది. ఏక్ దిన్ లో సాయి పల్లవి సింపుల్ లుక్స్ నార్త్ ఆడియన్స్ కి నచ్చలేదు. సినిమా కూడా సో సో గా ఉండడంతో ఏక్ దిన్ మొదటి వారాంతానికే థియేటర్స్ లో సైలెంట్ అయ్యింది.
హిందీలో మొదటి సినిమాతోనే సాయి పల్లవి ఆమె అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది. మరి రామాయణ పరిస్థితి ఏమిటో దివాళి కి తెలుస్తుంది.







































