విజయ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేనా

విజయ్ ఇప్పుడు హీరో కాదు పొలిటికల్ స్టార్. పోటీ చేసిన మొట్ట మొదటి ఎలక్షన్స్ లోనే రెండు చోట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు కాబోయే సీఎం. కాకపోతే 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కి అడుగు దూరంలో ఆగిపోయిన విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు వారాల గడువు తమిళనాడు గవర్నర్ ని కోరినట్లుగా తెలుస్తుంది.
అయితే హీరోగా విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ కి విజయ్ సీఎం అయ్యాక అయినా మోక్షం కలుగుతుందా, కలుగుతుంది. అంతేకాదు నిర్మాతలకు జన నాయగన్ చిత్రం భారీ కలెక్షన్స్ తేవడం ఖాయం. సీఎం విజయ్ సినిమా అంటే అభిమానులకు, ప్రేక్షకులకు పూనకాలే.
అయితే జన నాయగన్ చిత్ర టైటిల్ కార్డ్స్ లో విజయ్ పేరు ముందు సీఎం విజయ్ అనే టైటిల్ చూడాలని విజయ్ అభిమానులు కోరుతున్నారు. మరి అది నెరవేరుతుందా, విజయ్ జన నాయగన్ మేకర్స్ జన నాయగన్ టైటిల్ కార్డ్స్ లో సీఎం విజయ్ అని వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.







































