కొద్దిలో మిస్ అయిన విక్టరీ

తమిళనాట రాజకీయం ఊహించని మలుపులు తిరిగింది. డీఎంకే, అన్నాడీఎంకే ను మట్టికరిపించి హీరో విజయ్ టీవీకే పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించినా.. విక్టరీ ని కొద్దిలో మిస్ అయ్యింది. అంటే తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ని విజయ్ అందుకోలేకపోయారు. కానీ పార్టీ పెట్టిన కొద్ధి నెలలకే ఈ రేంజ్ విజయం విజయ్ నుంచి ఎవ్వరూ ఊహించనైనను లేదు.


కాకపోతే పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే 118 సీట్లు కావాల్సి ఉండగా.. విజయ్ పార్టీ 108 స్థానాలకే పరిమితమయ్యింది. దానితో మరో 11 మంది విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో గెలిచిన వారిని విజయ్ తండ్రి.. తన కొడుకు కోసం అడుగుతున్నారు. విజయ్ విజయం ఊహించకపోయినా.. ఆయన అభిమానులు ఆయన్ని సీఎం గా చూడాలనే గట్టి పట్టుదలతో కనిపించారు.


యువత, అలాగే విజయ్ మ్యానిఫెస్టో విజయ్ విజయానికి కారణమయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్, అలాగే ఎంజీఆర్ ల సరసన విజయ్ చేరినా ఆయన విజయం అసంపూర్ణంగా మిగిలింది. 118 సీట్లు గెలిచి ఉంటే విజయ్ అంతటి మహోన్నత వ్యక్తుల సరసన నిలిచేవారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లు బలమైన సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లారు. 


కానీ విజయ్ రాజకీయాలకు అంత సీరియస్ నెస్ లేదు. ఆయన అలవోకగా ఎన్నికల్లో వచ్చి గెలిచేసారు. మరి ఈ విజయాన్ని విజయ్ ఎలా కాపాడుకుంటారో, సీఎం గా ఎన్ని సవాళ్ళను ఎదుర్కుంటారో చూడాలి. 

Vijay VictoryTamil Nadu Politics