శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. మన తెలుగు మూలాలున్న హీరోయిన్లతో పాటు, పరభాషా భామలు కూడా తెలుగు సంప్రదాయంపై తమకున్న మక్కువను చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది దాదాపు ఏడుగురు అగ్ర కథానాయికలు స్వయంగా తమ నివాసాల్లో ఉగాది పచ్చడిని తయారు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. పట్టుచీరలు కట్టుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించి, షడ్రుచుల సమ్మేళనంతో పచ్చడిని సిద్ధం చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ఈ పండగ ప్రాశిష్ట్యాన్ని వివరిస్తూ సంప్రదాయ పద్ధతిలో పచ్చడిని తయారు చేశారు. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా తెలుగు సంప్రదాయం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, తొలిసారిగా స్వయంగా ఉగాది పచ్చడిని కలిపి ఆ వీడియోను పంచుకున్నారు. వీరితో పాటు నభా నటేష్, సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ వంటి భామలు కూడా షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి ఇంట్లోనే పచ్చడిని సిద్ధం చేశారు. వీరందరిలోనూ కీర్తి సురేష్ తన వంట గదిలో స్వయంగా మామిడి కాయలు కోస్తూ, వేపపువ్వు సేకరిస్తున్న దృశ్యాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
హీరోయిన్లు కేవలం పచ్చడిని తయారు చేయడమే కాకుండా? జీవితంలో ఎదురయ్యే తీపి, వొగరు, చేదు వంటి ఆరు రుచులను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని కూడా పంచుకున్నారు. గ్లామర్ ప్రపంచంలో నిరంతరం బిజీగా ఉండే తారలు, పండగ పూట ఇలా సంప్రదాయబద్ధంగా కనిపించడం ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మొత్తానికి ఈ ఉగాదికి మన హీరోయిన్లు అంతా `కిచెన్ క్వీన్స్`గా మారిపోయారు. తెలుగు వారి ఆచారాలను గౌరవిస్తూ తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.





ట్రైలర్ టాక్-స్పైడర్‌మేన్ గగుర్పొడిచే విన్యాసాలు

Loading..