Advertisementt

ఉస్తాద్ కి శ్రీలీల పారితోషికం ఎంతంటే

Tue 17th Mar 2026 01:29 PM
sreeleela  ఉస్తాద్ కి శ్రీలీల పారితోషికం ఎంతంటే
Sreeleela Remuneration for Ustaad Bhagat Singh ఉస్తాద్ కి శ్రీలీల పారితోషికం ఎంతంటే
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో వరస సినిమాల్తో తెగ హడావిడి చేసిన శ్రీలీల ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో తన లక్కుని, టాలీవుడ్ కెరీర్ ని పరీక్షించుకోబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత శ్రీలీల కు తెలుగులో ఆఫర్స్ లేవు. గత ఏడాది కూడా ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో డిజప్పాయింట్ చేసింది. ఈ ఏడాది ఉస్తాద్ తో బోణి కొట్టబోతుంది.

ఉస్తాద్ లో చాలా సింపుల్ గా, ట్రెడిషనల్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్న శ్రీలీల కు ఒకప్పుడున్న అవకాశాలు అయితే తెలుగులో లేవు. రెండుమూడేళ్లు ఆమె సక్సెస్ తో పని లేకుండా ఆఫర్స్ వచ్చి వాలాయి. కానీ ఇప్పుడు శ్రీలీల విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. అందుకే ఆమె తమిళనాట అలాగే నార్త్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది.

అక్కడ ఎలాగూ శ్రీలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. తమిళనాట ధనుష్, అజిత్, ధృవ్ విక్రమ్ ల సరసన నటిస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో బ్యాక్ టు బ్యాక్ కలిసి నటిస్తుంది. అయితే తెలుగులో ఉన్న క్రేజీ మూవీ ఉస్తాద్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించిన శ్రీలీల పారితోషికం పై అందరిలో చాలా ఆసక్తి కనిపిస్తుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి రూ.3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. మరి సోలో హీరోయిన్ గా భారీ పారితోషికం అందుకున్న శ్రీలీల ఉస్తాద్ లో రాశి ఖన్నా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అందుకే రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు మాత్రమే ఆమె పారితోషికం అందుకుంది అని తెలుస్తుంది.           

Sreeleela Remuneration for Ustaad Bhagat Singh:

Sreeleela Remuneration For Ustaad Bhagat Singh Revealed

Tags:   SREELEELA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ