ఏప్రిల్ 30 టార్గెట్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. కానీ పెద్ది చిత్రానికి సంబందించిన స్పెషల్ సాంగ్ బాలన్స్ ఉంది. దర్శకుడు బుచ్చి బాబు ఇప్పుడు అందుకోసమే రెడీ అవుతున్నారట. మరోపక్క పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.
అయితే పెద్ది చిత్రంలోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవడంతో ఐటమ్ సాంగ్ విషయంలోనూ బుచ్చిబాబు వేరే లెవల్ లో ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం ఫ్రేమ్ లో ఉన్న హీరోయిన్స్ ని చరణ్ కోసం తీసుకురావాలని చూస్తున్నాడట. సమంత, మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే, శ్రీలీల ఇలా కొంతమంది హీరోయిన్స్ పేర్లను పెద్ది ఐటమ్ సాంగ్ కోసం పరిశీలిస్తున్నారట.
తమకున్న తక్కువ సమయాన్ని బట్టి ఏ హీరోయిన్ డేట్స్ అడ్జెస్ట్ అవుతాయో అనే విషయాన్ని చర్చించి ఈ ఐటమ్ సాంగ్ కోసం బుచ్చి బాబు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తి కాగానే పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని చరణ్ అండ్ బుచ్చిబాబు ఆలోచనగా తెలుస్తుంది.




వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయి రెడ్డి 

Loading..