నిన్న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. అభిమానుల కోలాహలం నడుమ ఈవెంట్ సక్సెస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం తనలోని కామెడీ యాంగిల్ ని చూపిస్తూ జోష్ చూపించారు.
హరీష్ శంకర్ కూల్ గా మాట్లాడాడు, హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా లు గ్లామర్ గానే కాదు వారిద్దరూ కలిసి స్టేజ్ పై డాన్స్ వేస్తూ దుమ్మురేపారు. యాంకర్ సుమ సరదా చమక్కుల నడుమ ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఫుల్ జోష్ లో నడిచినా ఆ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోవడం వెలితిగా అనిపించింది.
ఉస్తాద్ స్టార్ట్ అయినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఉండగా.. చివరికి థమన్ వచ్చి చేరడం, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఏదో జరిగింది అనే అనుమానాల మధ్యన గత రాత్రి ఈవెంట్ లో దేవిశ్రీ కనిపించలేదు. దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీ అందుకే రాలేదు, ఆ బిజీ వల్లే థమన్ రావాల్సి వచ్చింది అంటూ కవర్ చేసినా..
పవన్ కి గత సినిమాలకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ విషయంలో మైత్రి వారికి హారిష్ కి చెడింది అనే ప్రచారం గత రాత్రి ఈవెంట్ తో నిజమైంది అని మాట్లాడుతున్నారు. ఇక థమన్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో కనిపించక పోవడం అందరిని డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి.




సింహం సింగిల్ గానే వస్తుంది 

Loading..