గత రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన డ్రగ్స్ పార్టీ సెన్సేషన్ సృష్టించింది. పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ ఫామ్ హౌస్ పై దాడులు జరిపి పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్ట్ లు చెయ్యగా అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి.
ఫామ్‌హౌస్‌లో రెండు గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. డ్రగ్స్ టెస్ట్‌లో MP పుట్టా మహేష్‌యాదవ్, పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలింది. పుట్టా మహేష్, రోహిత్‌రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. దానితో తెలుగు దేశం ఎంపీ పుట్ట మహేష్ పై టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం జారీ చేసారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఎంపి పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు ఆదేశించారు.
ఎంపి పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని, ఆదేశండ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చెయ్యడమే కాదు.. వ్యక్తులు, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు.




గుబులు పుట్టించిన మలైకా

Loading..