Advertisementt

చైతు షోయు కిచెన్ లో నాగ్ కి నచ్చిన ఫుడ్

Fri 13th Mar 2026 09:39 AM
naga chaitanya  చైతు షోయు కిచెన్ లో నాగ్ కి నచ్చిన ఫుడ్
Naga Chaitanya on food business చైతు షోయు కిచెన్ లో నాగ్ కి నచ్చిన ఫుడ్
Advertisement
Ads by CJ

అక్కినేని యువ హీరో నాగ చైతన్య సినిమాలతో పాటుగా అటు ఫుడ్ బిజినెస్ ఇటు కార్ రేసింగ్ అంటూ బిజీగా గడుపుతూ ఉంటాడు. నాగచైతన్య కు జాపనీస్ ఫుడ్ అంటే ఇష్టమట, అందుకే ఆ జాపనీస్ ఫుడ్ ని హైదరాబాద్ ప్రజలకు పరిచయం చెయ్యాలని.. ఇక్కడ షోయు అంటూ ఫుడ్ బిజినెస్ ను చైతు ఆరంభించాడు. 

మొదట్లో రెస్టారెంట్ ప్లాన్స్ ఉన్నా కరోనా వల్ల తన ప్లాన్స్ తల్లకిందులయ్యి క్లౌడ్ కిచెన్ మొదలు పెట్టాడట చైతు. తాజాగా చైతు ఫుడ్ బిజినెస్ అలాగే తన షోయు కిచెన్ లో తండ్రి నాగ్ కి ఇష్టమైన ఫుడ్ ఏమిటి అనేది రివీల్ చేసాడు. తన షోయు కిచెన్ లో ఏ వంటకమైన ముందు ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాతే తన కష్టమర్స్ కి వెళుతుంది అని చెప్పాడు.

ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేసినప్పుడు తన వైఫ్ శోభిత వాటిని టేస్ట్ చూసి ఎలా ఉందొ చెబుతుంది, అంతేకాదు మెనూ తయారీలో తన సలహాలు ఉపయోగపడతాయని, మా నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం నన్ను పిలిచి పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు.. నాకు పంపించు అని అడుగుతారు అంటూ చైతు తన రెస్టారెంట్ లో నాగ్ కి ఇష్టమైన ఫుడ్ పిజ్జా అంటూ చెప్పుకొచ్చాడు. 

Naga Chaitanya on food business:

Naga Chaitanya on Shoyu, Scuzi

Tags:   NAGA CHAITANYA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ