అవును మార్చ్ 19 రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇద్దరు హీరోయిన్స్ ఫేట్ మార్చబోతుంది. ప్లాప్ ల్లో ఉన్న శ్రీలీల కు ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ ఎంతో కీలకం. అలాగే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా టాలీవుడ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే గనక ఉస్తాద్ హిట్ అనేది ఆమె ఖాతాలో పడాల్సిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రేడ్ లోనే కాదు ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి కంటెంట్ కూడా తోడైతే ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్ లు క్రియేట్ చెయ్యడం ఖాయం. రెండు రోజుల క్రితం వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీస్ ఫ్యాన్స్ నే కాదు మాస్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసింది.
ఆ ఒక్క ట్రైలర్ టీస్ తోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే అటు శ్రీలీల, ఇటు రాశి ఖన్నా ఇద్దరికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇతర భాషలకు తరలి పోవాలి. ఇప్పటికే శ్రీలీల తమిళనాట, అలాగే హిందీలో జెండా పాతేందుకు రెడీగా ఉంది.




NBK111 లో హైలెట్ కానున్న జేసీబీ సీక్వెన్స్ 
Loading..