Advertisementt

ధురంధ‌ర్ 3 కి ఛాన్స్ ఉందా

Thu 12th Mar 2026 02:34 PM
dhurandhar  ధురంధ‌ర్ 3 కి ఛాన్స్ ఉందా
Dhurandhar 3 ధురంధ‌ర్ 3 కి ఛాన్స్ ఉందా
Advertisement
Ads by CJ

ఈ నెల 19న విడుదల కాబోతున్న `ధురంధర్ 2` పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో  సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే సినిమా విడుదల కాకముందే `ధురంధర్ 3` కి అవకాశం ఉందా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఈ చిత్ర దర్శకుడు కథను ఒక పెద్ద ఫ్రాంచైజీగా మలిచే ఆలోచనలో ఉన్నారని, రెండో భాగం ముగింపులో మూడవ భాగానికి సంబంధించిన బలమైన హింట్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్ న‌డుస్తోంది.నిర్మాణ సంస్థ , హీరో కూడా ఈ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

`ధురంధర్ 2` ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టి, ప్రేక్షకులను మెప్పించగలిగితే కచ్చితంగా మూడవ భాగం పట్టాలెక్కుతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో మరిన్ని కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు దర్శకుడు ఇప్పటికే కొన్ని కీలకమైన పాయింట్స్ సిద్ధం చేసుకున్నట్లు చర్చ జ‌రుగుతోంది. ఈ నెల 19న సినిమా టాక్ వచ్చిన తర్వాత `ధురంధర్ 3` పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

స్పై సినిమాల‌కు బాలీవుడ్ పెట్టింది పేరుగా ఏల్తోంది. ఆజాన‌ర్ లో తీసిన చాలా సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఈ నేప‌థ్యంలో ధురంధ‌ర్ ని ఓ యూనివ‌ర్శ్ గామ‌లిస్తే గ‌నుక అందులోకి ర‌క‌ర‌కాల క‌థ‌లు వ‌చ్చి చేరే అవ‌కాశం ఉంది. 

Dhurandhar 3:

Dhurandhar The Revenge

Tags:   DHURANDHAR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ