టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న అది. ముందు డ్రాగన్(వర్కింగ్ టైటిల్ ) విషయం తేల్చు స్వామి ఎన్టీఆర్.. ఆతర్వాత దేవర 2 గురించి ఆలోచిద్దూవు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యంగ్ టైగర్ ని వేడుకుంటున్నారు. #NTRNeel మూవీ షూటింగ్ మొదలై ఏడాది గడిచిపోయినా.. ఆ సినిమా అప్ డేట్ ఇవ్వకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
అయితే డ్రాగన్ విషయం తేలకుండానే ఎన్టీఆర్ దేవర 2ని మొదలు పెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే మొదటి వారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దేవర 2 మొదలు కావడం హ్యాపీనే.
కానీ నీల్ డ్రాగన్ ఫస్ట్ లుక్ వదలడమే, లేదంటే #NTRNeel రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడమో చేస్తే బావుంటుంది. ఉగాది రోజు అయినా #NTRNeel అప్ డేట్ ఇస్తారేమో అని అభిమానులు ఆశ. అందుకే ముందు నీల్ ని డ్రాగన్ విషయం తేల్చమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారు. మరి ఉగాది కి ఏమైనా అప్ డేట్ వస్తుందేమో చూద్దాం.




అల్లు అర్జున్ బర్త్ డే కి మూడు సర్ ప్రైజ్ లు 
Loading..