Advertisementt

పెళ్లి బంధానికి హన్సిక ముగింపు

Wed 11th Mar 2026 07:08 PM
hansika  పెళ్లి బంధానికి హన్సిక ముగింపు
Hansika-Sohael get divorced పెళ్లి బంధానికి హన్సిక ముగింపు
Advertisement
Ads by CJ

ఏళ్ళ తరబడి కాపురాలు చేసిన జంటలే విడాకులు తీసుకుని విడిపోయి షాకిస్తుంటే పెళ్ళైన నాలుగేళ్లకు భర్త తో విడాకులు తీసుకుని విడిపోయింది ఇప్పుడొక హీరోయిన్. ఆమె హన్సిక మోత్వానీ. ఎప్పటినుంచో భర్త సోహెల్‌ ఖతూరియా తో హన్సిక విడిపోతుంది, విడాకులకు అప్లై చేసింది అనే వార్తల నేపథ్యంలో నేడు బుధవారం హన్సిక కి కోర్టు విడాకులు మంజూరు చేసింది.

2022 లో రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్లో తన స్నేహితురాలి భర్త సోహెల్‌ ఖతూరియాను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న హన్సిక పెళ్ళైన రెండేళ్లకే ఇరువురి నడుమ విభేదాలు రావడంతో అప్పటినుంచి హన్సిక తన పేరెంట్స్ తో కలిసి భర్త నుంచి విడిగా ఉంటుంది. 

రెండేళ్ల క్రితమే హన్సిక భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు రెండేళ్ల విచారణాంతరం ఈరోజు విడాకులు మంజూరు చేసింది. హన్సిక - సోహెల్ ల పెళ్లి బంధం విడాకులుతో దూరమయ్యారు. పరస్పరం అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని హన్సిక తెలిపింది..

మా మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయి. ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉంది. 2024 జూలై 2 నుంచే తాము విడివిడిగా జీవిస్తున్నాం అంటూ హన్సిక తరపున లాయర్ కోర్టు కు చెప్పగా.. కోర్టు విచారణ తర్వాత విడాకులు మంజూరు చేసింది. 

Hansika-Sohael get divorced:

Hansika Motwani-Sohael Khaturiya divorced

Tags:   HANSIKA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ